ఎకనామిక్ గ్రోత్‌ను అనుసంధానించేలా ఎకో సిస్టం : మంత్రి శ్రీధర్‌బాబు

by Naga Rani Yarlagadda |

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

ఎకనామిక్ గ్రోత్‌ను అనుసంధానించేలా ఎకో సిస్టం : మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నోవాటెల్ హెచ్ఐసీసీలో నిర్వహించిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్ 2026కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే చేర్చేలా ఒక ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతున్నదని.. సంప్రదాయ పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అనుగుణంగా మార్పులను అందిపుచ్చుకునే దేశాలకే భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు.

డిజిటల్ పేమెంట్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు.. సాధిస్తున్న పరివర్తనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్నదన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో భారత్ సాధిస్తున్న ప్రగతికి తెలంగాణ ఒక గ్రోత్ ఇంజన్ లా మారిందన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్.. ఈ మూడింటినీ నడిపించే ఒక బలమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో మన వాటాను10 శాతానికి చేర్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. మారుతున్న ట్రెండ్స్‌కు స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఅండ్ఏజీ ఆనంద్ మోహన్ బజాజ్, సెర్ట్-ఇన్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ సోలంకి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ రాజగోపాల్ శర్మ, సెబీ సీజీఎం సాహిల్ మాలిక్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, ఆర్బీఐ సీజీఎం శైలజారాణి జంపాల, ఎన్ఎస్ఈ సీఐఎస్‌వో రాజేష్ థాపర్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో వినాయక్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు.

Next Story