- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది అధికార పార్టీ అంటా..! తెలంగాణ 365 టీమ్ సర్వేలో కీలక విషయాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది అధికార పార్టీ కాంగ్రెస్ అంటూ తెలంగాణ 365 టీమ్ సర్వేలో కీలక విషయాలు వెల్లడించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Jubilee Hills by-election) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది అధికార పార్టీ కాంగ్రెస్ అంటూ (Telangana 365 Team Survey) తెలంగాణ 365 టీమ్ సర్వేలో కీలక విషయాలు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ 365 టీమ్ Sample size-3500 అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరాలు ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణం అనంతరం వస్తున్న ఈ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ 51 శాతం నుంచి 54 శాతం వరకు ఓటర్లు కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. కేవలం సెంటిమెంట్ నీ మాత్రమే అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అంతగా కలిసి రాని అంశంగా టీమ్ అభివర్ణించింది.
ఉప ఎన్నికల క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత (Kavitha) సస్పెండ్ అవ్వడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంది. సిట్టింగ్ స్థానంలో 31 శాతం నుంచి 35 శాతం ఓట్లతో బీఆర్ఎస్ సరిపెట్టుకోనుందని తెలిపింది. బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఈ ఉప ఎన్నిక పట్ల ఆసక్తి చూపడం లేదని, అందుకే ఆ పార్టీకి 14 శాతం నుంచి 16 శాతం మధ్యే ఓటు శాతం ఉందని, ఇప్పటి వరకు నియోజకవర్గ ఉప ఎన్నికల ఇంచార్జీలను నియమించలేక పోవడం పార్టీకి ప్రతికూల వాతావరణం నెలకొందని వెల్లడించింది. ఇక, ఈ సర్వే కేవలం ప్రధాన పార్టీల మీద నిర్వహించింది మాత్రమేనని తెలిపింది. అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మా సంస్థ మరో సర్వే అభ్యర్థుల మీద నిర్వహిస్తామని ప్రకటించింది. ట్వీట్ లిక్..
కాగా, జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ.. నవంబర్11న ఎన్నిక.. నవంబర్ 14న కౌంటింగ్ ఉండనుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచే హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.






