Teenmar Mallanna : మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై నేటి ఉదయం తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

Teenmar Mallanna : మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై నేటి ఉదయం తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన మల్లన్న, దాడిని తీవ్రంగా ఖండించిన మల్లన్న, ఇకపై బీసీల తఢాఖా చూపిస్తామని వర్కింగ్ ఇచ్చారు. అనంతరం ఈ ఘటనపై మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక తనను చంపే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

దాడి సమయంలో జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. మల్కాజిగిరి డీసీపీ పద్మాజ రెడ్డి క్యూ న్యూస్ ఆఫీసుకు చేరుకొని కాల్పుల వివరాలు సేకరించారు. కాగా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ జాగృతి కార్యకర్తలు ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తనపై వ్యాఖ్యలు చేసారని, తక్షణమే మల్లన్నను మండలి నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ కవిత మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది.

Next Story