- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన పెను ప్రమాదం
by Kema Shiva Kumar |
తిరుపతి (Tirupati)కి బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)కి బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని బోర్డింగ్ ముందే రద్దు చేశారు. ఇవాళ ఉదయం స్పైస్‌జెట్‌కు చెందిన ఫ్లైట్ మొత్తం 80 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. అయితే, బోర్డింగ్ సమయంలో సాధారణ తనిఖీలో భాగంగా పైలెట్లు విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి టెక్నికల్ టీమ్‌కు సమాచారం అందజేశారు. అనంతరం సర్వీసును అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేస్తున్నట్లుగా స్పైస్‌జెట్ అధికారులు ప్రకటించారు. దీంతో 80 ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. అయితే, వారిని మరో విమానంలో తిరుపతికి తరలించేందుకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Next Story






