- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: విద్యార్థులకిది కీలకమైన సమయం.. ఈసీకి విజ్ఞప్తి
రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో ఉపాధ్యాయులకు కేటాయించిన బీఎల్ఓ డ్యూటీ నుండి మినహాయించాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో ఉపాధ్యాయులకు కేటాయించిన బీఎల్ఓ డ్యూటీ నుండి మినహాయించాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుందని గుర్తు చేశారు. విద్యార్థులకు వార్షిక పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్స్ జరుగుతున్న కీలక సమయమని, ఉపాధ్యాయులు బోధనను వదిలి బీఎల్ఓ విధుల కోసం తిరగడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వారు కోరారు. తపస్ నేతల విజ్ఞప్తిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సానుకూలంగా స్పందించి, సంబంధిత జిల్లా కలెక్టర్లతో మాట్లాడి, విద్యార్థుల బోధనకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






