- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T BJP: ఎందుకు దాటవేస్తున్నారో చెప్పండి.. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Aleti Maheshwar Reddy) విమర్శించారు. మొంథా తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, సోయాలో తేమ శాతం చూడకుండా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ బీజేపీ తరఫున ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆయా పంటలకు మద్దతు ధర ఎందుకు ఇవ్వకుండా దాటవేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమాధానం చెప్పాలన్నారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.






