కృష్ణయ్య హత్య కేసులో తమ్మినేని వీరభద్రం హస్తం?

by Disha Web Desk 2 |
కృష్ణయ్య హత్య కేసులో తమ్మినేని వీరభద్రం హస్తం?
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తుండగా.. కృష్ణయ్య భార్య మంగతాయి సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త హత్యకు ప్రధాన కారణం తమ్మినేని వీరభద్రం, కోటేశ్వరరావులే అని మంగతాయి, ఆమె కుమార్తె అరోపించారు. కావాలనే తమను టార్గెట్ చేసి దాడులు చేశారని, గతంలో అనేకమార్లు చంపుతామని బెదిరించారని వాపోయారు. గ్రామంలో తమకు పెరగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే మాపై అనేకమార్లు దాడులు చేసినట్లు అరోపించారు. ఈ దాడి వెనుక ఉన్న ప్రధాన ముద్దాయిలను పట్లుకుని శిక్షించాలని, పోలీసులకు చేతకాకపోతే తామే చూసుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''మా నాన్న హత్యకు కారకులు ఎవరో గ్రామస్తులు అందరికీ తెలుసు. వెంటనే వారికి పోలీసులు శిక్షించాలి.'' అని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

హంతకులకు మాజీ మంత్రి తుమ్మల వార్నింగ్.. కృష్ణయ్య కుటుంబానికి భరోసా


Next Story