- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు ప్రభుత్వ వైద్యులకు తెలంగాణలో శిక్షణ
by Ramesh Naini |
తమిళనాడు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న సర్జికల్ ఆంకాలజిస్టులకు గైనకాలజికల్ ఆంకాలజీలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తమిళనాడు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న సర్జికల్ ఆంకాలజిస్టులకు గైనకాలజికల్ ఆంకాలజీలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ శిక్షణను అందించింది.
తమిళనాడు ప్రభుత్వం, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సాంకేతిక సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా అక్కడి వైద్యులకు అధునాతన శస్త్రచికిత్స నైపుణ్యాలను నేర్పించారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వర రావు నేతృత్వంలో నిపుణులైన వైద్య బృందం ఈ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ వైద్యుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పేద రోగులకు మెరుగైన క్యాన్సర్ చికిత్స అందుతుందని డాక్టర్ రావు పేర్కొన్నారు.
Next Story






