- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
హకీంపేట డిపో బస్సు డ్రైవర్, కండక్టర్లతో పాటు ప్రయాణికులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ ఎస్.డబ్ల్యు.ఎఫ్ యూనియన్ డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హకీంపేట డిపో బస్సు డ్రైవర్, కండక్టర్లతో పాటు ప్రయాణికులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ నుంచి సిఆర్పిఎఫ్ కు వెళుతున్న ఆర్టీసీ బస్సును యాప్రాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్కూటీని అడ్డంగా పెట్టి బస్సులోకి ఎక్కి తమను ఎందుకు ఓవర్ టేక్ చేశారంటూ డ్రైవర్, కండక్టర్ పై అసభ్యంగా తిడుతూ దాడికి పాల్పడ్డారని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు. ఉప్పలయ్య, షహీన్ బేగం అడ్డుగా వచ్చినందుకు వారిపైనా దాడి చేశారని అన్నారు. స్కూటీ నంబర్ కనిపించకుండా నంబర్ ప్లేట్ కు పేపర్ అతికించి బస్సుకు అడ్డంగా స్కూటీ నిలిపి, డ్యూటీలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులపైన దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహాలక్ష్మి స్కీం నేపథ్యంలో బస్సులలో విపరీతమైన రద్దీ పెరిగిందని.. పనిభారంతో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, కండక్టర్లపై దాడులు చేయడంతో భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని ఎస్.డబ్ల్యు.ఎఫ్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. సిబ్బందిపై దాడులు జరుగుతూ పోతే బస్సులు నడపడం కష్టంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






