- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T Congress : కాంగ్రెస్ పెద్దల ముందు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల గోడు
తెలంగాణ(Telangana)లో పదవుల పంచాయితీ ఢిల్లీని చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో పదవుల పంచాయితీ ఢిల్లీని చేరింది. తమ సామాజిక వర్గానికి కనీసం ఒక మంత్రి పదవి అయినా కేటాయించాలని పలువురు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(T Congress MLA's) అధిష్టానం నేతలను కలిసి విన్నవించారు. తెలంగాణ మాదిగ సామాజిక వర్గానికి(Telangana Madiga Community MLA's) చెందిన ఎమ్మెల్యేలు నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge)తో అరగంటపాటు సమావేశమయ్యారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి తగిన అవకాశాలు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. మాదిగలు రాష్ట్రంలో గణనీయమైన జనాభా ఉన్న సామాజిక వర్గం కావడంతో, వారి రాజకీయ, సామాజిక ఆకాంక్షలను పరిగణించాలని కోరారు.
అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal)ను కూడా కలిసి తమ విన్నపాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్ విస్తరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవులు కేటాయించాలని నేతలు అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం.. అయితే, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ తగిన సమయం దొరక్కపోవడంతో కొంత నిరాశ వ్యక్తమైందని వార్తలు వస్తున్నాయి.
కాగా గత కొంత కాలంగా మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్‌లో ప్రాతినిధ్యం కోసం టీ కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గానికి చెదనిన నేతలు బలంగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల ఫలితాలు, కేబినెట్ విస్తరణలో మాదిగలకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.






