- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ టీ-బీజేపీ సంచలన నిర్ణయం
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆదేశించింది. రాష్ట్ర ఆవిర్భావంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ప్రముఖమైనదనే విషయాన్ని ప్రజలకు వివరించాని నిర్ణయించింది. తమ పార్టీ సహకారంతోనే పార్లమెంటులో బిల్లు పాస్ అయిన విషయాన్ని వివరించనుంది.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో బీజేపీ సంఘీభావం తెలియజేసిన విషయాన్ని వివరించనుంది. ఉద్యమంలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల నుంచి జాతీయస్థాయి నాయకుల వరకు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పనుంది. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఉద్యమకారులను సన్మానించడంతో పాటు ఉద్యమంలో అసువులుబాసిన, ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను కలవాలని బీజేపీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే వేడుకలకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.






