- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T BJP: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో స్లీపర్ సెల్స్.. తెలంగాణ బీజేపీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ ఎల్డ్ సిటిలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమేయాలని టీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పాతబస్తీలో (Hyderabad Old City) స్లీపర్ సెల్స్ (Sleepal Cells) ఉన్నారని ఎన్ఐఏ, ఐబీ సంస్థలు గతంలో హెచ్చరించాయని పాతబస్తిలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమికొట్టాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) డిమాండ్ చేశారు. వీసా గడువులు తీరినా ఇంకా అనేక మంది అక్రమ వలసదారులు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు, టూరిస్టులు ఓల్డ్ సిటీలో అక్రమంగా ఉంటున్నారని మీడియాలో కథనాలు వచ్చాయని ఇలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో పోలీసులకు స్వేచ్ఛనివ్వాలన్నారు. ఎంఐఎం పార్టీ గతంలో బీఆర్ఎస్ తో ప్రస్తుతం కాంగ్రెస్ తో స్నేహం చేస్తంది. దీంతో అక్రమ వలసదారుల విషయంలో పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనబడుతోందన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంఐఎంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల రాజకీయ మైత్రి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉండొద్దని అన్నారు. పహెల్గాం ఉగ్రదాడి ఘటన దేశాన్ని కుదిపేసిందని, పర్యాటకులను ఎంచుకుని మరీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. ఈ దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించిందని అయితే మరింత కఠవుగా వ్యవహరించాలని దేశప్రజలు కోరుతున్నారన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు, వ్యక్తులు, పొరుగున ఉన్న దేశాలు తప్పకుండా మూల్యం చెల్లించేలే చేయాలని దేశ ప్రజలు భావిస్తున్నారన్నారు.
ఏం సాధించారని బీఆర్ఎస్ ఉత్సవాలు?:
బీఆర్ఎస్ పార్టీ ఏం సాధించిందని రజతోత్సవ వేడుకలు జరుపుకోవాలనుకుంటోందని ప్రభాకర్ ప్రశ్నించారు. నాడు అధికారంలో నేడు ప్రతిపక్షంలో అన్ని రకాలుగా విఫలమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఉత్సవాలు జరుపుకునే అవకాశం, అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ లో యువరాజు, యువరాణి మాత్రమే ఉన్నట్లుగా గత పదేళ్ల పాలనలో అందరికీ అర్థమైందన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకుని తమ వైఫల్యాన్ని చూపించుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు హాజరుకాకుండా ఫెయిలయ్యారన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటైందని చెప్పుకున్న పార్టిీ కేవలం నలుగురికే పరిమితమై విఫలమైందన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరి కోసం ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటోంది? యువరాజుకు పట్టం కట్టాలనా? లేక యువరాణికి పట్టం కట్టాలనా? అని ప్రశ్నించారు. ఈ యువరాణి, యువరాజు అనేక కుంభకోణాల్లో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు. ప్రతి కుంభకోణంలో బీఆర్ఎస్ పాత్రే ఉన్నదని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా గులాబీ పార్టీ ఘోరంగా విఫలమైందన్నారు. అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణను అన్ని రంగాల్లో పునర్ నిర్మిస్తామని పదేపదే మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు కేవలం కుటుంబ నిర్మాణమే జరుపుకున్నారని ధ్వజమెత్తారు. సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత సేనాధిపతి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి విఫలమైన కేసీఆర్ ఇక ఆ పార్టీకి వీఆర్ఎస్ ఇస్తే మంచిదని సెటైర్ వేశారు.






