- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సజ్జనార్‌పై SWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేస్తారా..ఖబడ్దార్ అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌పై SWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేస్తారా..ఖబడ్దార్ అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌పై SWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ఫిర్యాదు వస్తే న్యాయవిచారణ చేయకుండానే సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పడనివాళ్లు కూడా ట్విట్టర్ లో ఫిర్యాదు చేస్తారని అన్నారు. ఎండీకి ట్విట్టర్‌లో ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు న్యాయవిచారణ చేయకుండా సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవం తెలుసుకుని ఆ తరవాత చర్యలు తీసుకోవాలని అన్నారు.
ట్విట్టర్ లో కార్మికులు తమ సమస్యలు చెబితే మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కార్మికులపై అధికారుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, హేళనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరించారు. వారం రోజులు సజ్జన్నార్ కు సమయం ఇస్తున్నామని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని హెచ్చరించారు. లేదంటే ఊరుకునేది లేదని అన్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్‌లో సజ్జన్నార్ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కండక్టర్‌లు, డ్రైవర్లు లేదా ఇతర సిబ్భందిపై ట్విట్టర్‌లో ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై కార్మికులు కొద్దిరోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






