- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి కార్మికులకు తీపికబురు.. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.1,95,610 బోనస్
సింగరేణి (Singareni) కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి (Singareni) కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు దసరా పండుగ సందర్భంగా 34 శాతం బోనస్ ప్రకటించింది. మొత్తంగా రూ.819 కోట్లలో ఒక్కో కార్మికుడికి రూ.1,95,610లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. సింగరేణి సంస్థ మొత్తంగా రూ.6,394 కోట్ల లాభాన్ని ఆర్జించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సంస్థ విస్తరణ ఖర్చులు, ఇతర ఖర్చులు పోను రూ.2,360 కోట్లు లాభంగా తేలిందని అన్నారు. అందులో మొత్తం 71 వేల మంది కార్మికులకు రూ.819 కోట్లను ప్రభుత్వం దసరా బోనస్ కింద పంపిణీ చేయనుంది.
Next Story






