నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వారికి ఈ కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్, ఉద్యోగం

by Naga Rani Yarlagadda |

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వారికి ఈ కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్, ఉద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ (Swamy Ramananda Tirtha Rural Institute) వారు శుభవార్త చెప్పారు. టెన్త్, ఇంటర్ పాసై ఏ ఉద్యోగం లేని యువతీ యువకులకు ఫ్రీగా కంప్యూటర్స్, సోలార్ సిస్టమ్ ఇన్ స్టలేషన్ అండ్ సర్వీస్ కోర్సులు చెప్పి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని సంస్థ ఛైర్మన్ తెలిపారు. ఇంటర్మీడియట్ పాసైన వారికి బేసిక్ కంప్యూటర్స్ లో రెండు నెలలు ఉచిత శిక్షణతో పాటు, హాస్టల్, భోజన వసతి కూడా కల్పిస్తామని తెలిపారు. అలాగే టెన్త్, ఐటీఐ చదివిన వారికి సోలార్ సిస్టమ్ ఇన్ స్టలేషన్ అండ్ సర్వీస్ లో మూడున్నర నెలలు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ భోజన వసతులు కల్పించి, శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగం కూడా ఇప్పిస్తామని వెల్లడించారు.

ఆసక్తికల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాలలోపు ఉండాలి. అలాగే గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. దరఖాస్తు చేసుకునేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటి జిరాక్సులు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్సులు తీసుకుని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం, జలాల్ పూర్ గ్రామంలో ఉన్న స్వామి రామానంద తీర్థ సంస్థకు రావలసిందిగా సూచించారు. మరిన్ని వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Next Story