Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూలో ప్రభుత్వానికి షాక్.. ధర్మాసనం సంచలన ఆదేశాలు

by Shiva |   ( Updated:2025-04-16 06:53:14.0  )
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూలో ప్రభుత్వానికి షాక్.. ధర్మాసనం సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (Hyderabad Central University) పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం (State Government)తో పాటు ఎంపవర్డ్‌ కమిటీ (Empowered Committee)ని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా.. ఈ మేరకు ఇవాళ జస్టిస్‌ బీఆర్‌ గవాయి (Justice BR Gavai), జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ (Justice Augustine George Masih)తో ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అయితే, విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి (Kacha Gachibowli) భూముల్లో చెట్ల నరికివేతపై కోర్టు మరోసారి సీరియస్ అయింది.

ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి ప్రభుత్వం తరఫు న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించారు. పర్యవరణ పరిరక్షణలో తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చెట్ల నరికివేత విషయంలో రాష్ట్ర సీఎస్‌ (CS)తో సంబంధిత అధికారులు జైలుకు వెళ్తారని.. ఒకవేళ వారిని కాపాడాలనుకుంటే విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. చెట్ల పునరుద్ధరణను ప్రభుత్వ అధికారులు వ్యతిరేకిస్తే.. ఆ భూముల్లోనే టెంపరరీ జైలును కట్టి వారిని అందులోకి పంపుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నోటీసులో లేకుండా వివాదాస్పద భూమిలో ఒక్క చెట్టు కూడా నరకొద్దని.. తాము తీర్పు ఇచ్చాక కూడా ఆ ప్రాంతంలో ఇంకా బుల్డోజర్లు ఎందుకున్నాయంటూ కోర్టు ఆక్షేపించింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు బదులిస్తూ.. ఏఐతో రూపొందించిన ఫేక్ వీడియో (Fake Video)లతో విపక్షాలు ప్రభుత్వంపై సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా దుష్ప్రచారం చేశాయని ధర్మాసనానికి విన్నివించారు. మినహాయింపునకు లోబడే చెట్లను తొలగించామని పేర్కొన్నారు. ఆ భూముల్లో ప్రస్తుతం అన్ని పనులను ఎక్కడికక్కడే నిలిపివేశామని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతవం కానివ్వకుండా చూసుకుంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయంలో స్టేటస్ కో (Status Co) కొనసాగుతుందని తెలిపింది. అదేవిధంగా తదుపరి విచారణను మే 15కు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. అదేవిధంగా భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు..? ఎంతకాలంలో ఆ పనులు పూర్తి చేస్తారు, జంతువులను ఎలా సంరక్షిస్తారు వంటి అంశాలపై ప్రణాళికను 4 వారాల్లోగా ఫైల్ చేయాలని కోర్టు మద్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది.



Next Story

Most Viewed