- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లెల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
అన్ని రంగాలతో పాటు వైద్య రంగం కూడా ఎంతో పురోగతి సాధిస్తోంది.

దిశ తెలంగాణ బ్యూరో: అన్ని రంగాలతో పాటు వైద్య రంగం కూడా ఎంతో పురోగతి సాధిస్తోంది. పల్లెలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-సంజీవని టెలీమెడిసిన్ రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తోంది. 2018లో ప్రారంభించిన ఈ-సంజీవని సేవలు మరింతగా విస్తరిస్తున్నాయి.
ఈ- సంజీవని ఎలా పనిచేస్తుంది...
పీహెచ్సీలలో ఉన్న వైద్యులు, సిబ్బంది.. అక్కడికి వచ్చిన రోగుల చేత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీపంలోని స్పెషాలిటీ హబ్ లోని వైద్యులతో మాట్లాడిస్తారు. దీంతో స్పెషాలిటీ వైద్యులు ఏ వైద్యం అందించాలో ప్రిస్క్రిప్షన్ ద్వారా పీహెచ్‌సీ వైద్యులకు సూచిస్తారు. అవసరమైతే సదరు రోగిని చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లేదా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలిస్తారు. రాష్ట్రంలో 2022 నుంచి ఇప్పటి వరకు 2.52 కోట్ల జనరల్ కన్సల్టేషన్ వైద్య సేవలు, 17.6 లక్షల సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్ సేవలూ అందాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ- సంజీవని (esanjeevani.mohfw.gov.in) వెబ్‌సైట్ లింక్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు.
పీహెచ్సీలోనే స్పెషాలిటీ సేవలు
జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఫిజియోథరెపీ, అప్తల్మాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రి, ఎండోక్రై నాలజీ, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, యురాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ వైద్య సేవలు పీహెచ్‌సీలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందిస్తారు. ఇప్పటి వరకు 4,11,304 మంది రోగులకు జనరల్ మెడిసిన్, 3,01,949 మందికి గైనిక్, 1,91,674 మందికి పీడియాట్రిక్ వైద్య సేవలు అందించారు.
వెయ్యి మంది స్పెషాలిటీ డాక్టర్లు
రాష్ట్రవ్యాప్తంగా 77 స్పెషాలిటీ హబ్‌ల ద్వారా వెయ్యి మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులను ఈ స్పెషాలిటీ వైద్యానికి హబ్‌గా మార్చారు. స్పెషాలిటీ వైద్యులు 20 రకాల స్పెషాలిటీస్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిత్యం రోగులకు వైద్యం చేస్తున్నారు. ఈ- ప్రిస్క్రిప్షన్, ఈ- హెల్త్ రికార్డు వంటి సదుపాయాలతో వైద్యులు ఆన్‌లైన్ వైద్య సేవలు అందిస్తున్నారు.






