తెలంగాణలో భానుడి ప్రతాపం...ఈ సీజన్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో ఎండ‌లు మండిపోతున్నాయి. ఏప్రిల్ లోనే ఎండ‌లు దంచికొట్ట‌గా మే నెల ప్రారంభం అవ్వ‌గానే ఊష్ణోగ్ర‌త‌లు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు ఈ సీజ‌న్ లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ్వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

తెలంగాణలో భానుడి ప్రతాపం...ఈ సీజన్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో ఎండ‌లు మండిపోతున్నాయి. ఏప్రిల్ లోనే ఎండ‌లు దంచికొట్ట‌గా మే నెల ప్రారంభం అవ్వ‌గానే ఊష్ణోగ్ర‌త‌లు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు ఈ సీజ‌న్ లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ్వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యాయి. నిజామాబాద్ జిల్లాలో గ‌రిష్టంలో నేడు 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. న‌ల్గొండ‌, నిర్మ‌ల్, సిద్ధిపేట జిల్లాల్లో 45,9 డిగ్రీల ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యాయి. ఆదిలాబాద్, పెద్ద‌ప‌ల్లి జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఇక హైద‌రాబాద్ లోనూ భానుడు ప్ర‌తాపం చూపిస్తున్నాడు. గ‌తంలో లేనంత‌గా ఎండలు కొట్ట‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నారు. ఏదైనా ప‌ని ఉంటేనే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌డంలేదు. దీంతో మ‌ద్యాహ్నం స‌మ‌యంలో రోడ్ల‌న్నీ ఖాళీగా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ఇక గ్రామాల్లో అయితే మ‌ద్యాహ్నం అస‌లు ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చేందుకే బ‌య‌ప‌డిపోతున్నారు. బ‌య‌ట తిరిగేవాళ్లు ఎండ‌లను త‌ట్టుకునేందుకు ఓఆర్ఎస్, కొబ్బ‌రి నీళ్లు, జూసులు తాగుతున్నారు.

Next Story