హైదరాబాద్‌లో అకస్మాత్తుగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాలను కమ్మేసిన చీకటి

by Gantepaka Srikanth |

గతకొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న నగర ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఊరటనిచ్చింది.

హైదరాబాద్‌లో అకస్మాత్తుగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాలను కమ్మేసిన చీకటి
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న నగర ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఊరటనిచ్చింది. సోమవారం ఉదయం నుంచి తీవ్రమైన ఎండలు మండిపోగా, సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. కేవలం గంట క్రితం వరకు చురుకైన ఎండ ఉండగా, ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై చీకటిగా మారిపోయింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు భయపెడుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నగరంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలి వాన వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి ఈ చల్లని వాతావరణం ఊరటనిచ్చినప్పటికీ, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల ట్రాఫిక్ అంతరాయాలు కలిగే అవకాశం ఉంది. నగరవాసులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని హెచ్చరిస్తున్నారు.

Next Story