సక్సెస్​పుల్‌గా ఆరోగ్య మహిళా స్కీమ్.. మహిళల్లో ‘న్యూట్రిషన్ల’ లోపం..!

by Disha Web Desk 13 |
సక్సెస్​పుల్‌గా ఆరోగ్య మహిళా స్కీమ్.. మహిళల్లో ‘న్యూట్రిషన్ల’ లోపం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో న్యూట్రిషన్ల లోపంతలెత్తుతున్నది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా చాలా మంది మహిళల్లో ఈ సమస్యలు బయట పడుతున్నాయి. ఇన్నాళ్లు ఈ సమస్య తమలో ఉన్నదా? అంటూ మహిళలు షాక్​కు గురవుతున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ క్యాంపుల్లో ఇప్పటి వరకు 15,640 మంది మహిళల్లో రెటినాల్, విటమిన్​బీ –1,2,3,5,6,7,9,12 తో పాటు విటమిన్​సీ,డీ,ఈ,కే, కాల్షియం, క్రోమిమం, కాపర్, ప్లోరైడ్ ఐయోడిన్, ఐరన్​, మెగ్నిషియం, మాంగసీస్, ఫాస్పరస్, పోటాషియం, సెలేనియం, సోడియం, జింక్​వంటి న్యూట్రిషన్లు లోపం ఉన్నట్లు గుర్తించారు. వీరికి సంబంధిత డాక్టర్లు అవసరమైన మందులు, టానిక్​లను అందించినట్లు ఆరోగ్య మహిళా క్యాంపు ఇంచార్టీ డాక్టర్లు చెబుతున్నారు.అత్యధికంగా ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, నిజామాబాద్, యాదాద్రి తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారిక నివేదికలు చెబుతున్నాయి.

ఎక్కువ మందికి బ్రెస్ట్​, నోటి క్యాన్సర్ ​పరీక్షలు..

ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఆరోగ్య మహిళా స్కీమ్​లో ఇప్పటి వరకు 54,872 మంది బ్రెస్ట్, నోటి క్యాన్సర్ల ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.అనుమానితులను ఎంఎన్​జే ఆసుపత్రికి రిఫర్ చేశారు.దీంతో పాటు మూత్రకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 3,270 మందికి ఆసుపత్రులలో చికిత్స కొనసాగుతుందని డాక్టర్లు తెలిపారు.ఇక మహిళా క్యాంపులలో చెకప్​లు తర్వాత 4,377 మందిని ఉస్మానియా, నిమ్స్​, ఎంఎన్​జే, గాంధీ వంటి ప్రధాన టీచింగ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి హరీష్​రావు

మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఉమెన్‌ స్పెషల్‌ క్లినిక్స్‌కు ఆదరణ పెరుగుతున్నది. మహిళల సమ్రగ అరోగ్య పరిరక్షణ కోసం, మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఈ సేవలను మహిళలంతా వినియోగించుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి పెద్దాసుపత్రులకు రిఫర్​చేస్తున్నాం.

Next Story