జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి : సదానందం గౌడ్

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని ఎస్టీయూ టియస్ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ అన్నారు.

జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి : సదానందం గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని ఎస్టీయూ టియస్ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ అన్నారు. ఆదివారం మన్నెగూడలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన సంఘ రాష్ట్ర తృతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు నూతనంగా ఉమ్మడి సర్వీస్‌ నిబంధనలు రూపొందించాలని, ఖాళీగా ఉన్న 600 కు పైగా ఎంఈవో పోస్టులు, 80 డిప్యూటీ ఈవో క్యాడర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో మేరకు సిపిఎస్ రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ పే, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో జీవో 190 ని అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న కుల గణన సర్వే పారితోషికం, సిపిఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన డిఎ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న జిల్లా పరిషత్ జిపిఎఫ్. కు సంబంధించి వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story