సింగరేణిలో సమ్మె సైరన్

by Muthe.Rajitha |

సింగరేణిలో మరో సమ్మె సైరన్ మోగనుంది.

సింగరేణిలో సమ్మె సైరన్
X

దిశ, వెబ్ డెస్క్ : సింగరేణిలో మరో సమ్మె సైరన్ మోగనుంది. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరుతో కాలయాపన చేయవద్దని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్‌మెంట్లలో ఏఐటీయూసీ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యం కారణంగా ఉద్యోగం చేయలేక కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.

మారుపేర్లపై ఉన్న విజిలెన్స్ కేసులు పరిష్కరించి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అలవెన్సులపై విధిస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్‌ను కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలని, డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసారు. అలాగే గుర్తింపు సంఘంతో చర్చలు జరపకుండా జారీ చేసిన 150 మస్టర్ల సర్కులర్‌ను రద్దు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్ష నిర్వహించాలని అన్నారు.

మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, వీకే కోల్ మైన్‌ను పర్మినెంట్ ఉద్యోగులతోనే నడపాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లకు యాజమాన్యం త్వరగా స్పందించి పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు ఆందోళనలకు, నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Next Story