జెన్కో, ట్రాన్స్కో లో 6 నెలలపాటు సమ్మె నిషేధం

by Muthe.Rajitha |

తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.

జెన్కో, ట్రాన్స్కో లో 6 నెలలపాటు సమ్మె నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర పవర్ కార్పొరేషన్లలో రానున్న 6 నెలలపాటు సమ్మెలను(Strikes) నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో(TransCo) లోని మూడు డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో, జెన్కో(GenCo)లో విద్యుత్ ఉద్యోగులు ఎలాంటి సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఈ ఉత్తర్వులు నవంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.

అయితే ఇంతకముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు పవర్ కార్పొరేషన్లలో సమ్మెలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. తాజాగా వాటిని మరో 6 నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తర్వులను అతిక్రమించిన విద్యుత్ ఉద్యోగులపై, ఆయా ఉదయిగా సంఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

Next Story