- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Spa Centers: హైదరాబాద్‌లో స్పా సెంటర్లపై కఠిన నిబంధనలు.. రాత్రి 9 వరకే.. పోలీసుల హెచ్చరికలు
హైదరాబాద్‌లో (Spa Centers) స్పా సెంటర్లపై కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో (Spa Centers) స్పా సెంటర్లపై కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు (Cyberabad Police Commissionerate) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మదాపూర్ జోన్‌లోని స్పా కేంద్రాల యజమానులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఏహెచ్‌టీయూ(యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్), లా అండ్ ఆర్డర్ విభాగం, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్ఓటీ) అధికారులు కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల భద్రత, ట్రాఫికింగ్ నివారణ, చట్టబద్ధ కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే స్పా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే స్పా సెంటర్ల నిర్వాహకులకు పోలీసులు పలు నిబంధనలు సూచించారు. అందులో భాగంగా స్పా కేంద్రాల్లో లైంగిక కార్యకలాపాలు నిర్వహించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు.
ఉదయం 9 నుంచి రాత్రి 9 లోపు స్పా నిర్వహించుకునేలా అధికారుల సూచనలు చేశారు. నివాస ప్రాంతాల్లో స్పా సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. స్పా ఉద్యోగులకు ఫిజియోథెరపీ, అక్యుప్రెషర్ లాంటి వాటిపై అర్హత ఉండాలన్నారు. ఉద్యోగుల వివరాల రిజిస్టర్, పనిచేసే ఉద్యోగుల వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. కస్టమర్ల పేర్లు, అడ్రస్ పొందుపరిచే రిజిస్టర్ సైతం ఉండాలి. పని సమయాల్లో ప్రవేశ ద్వారం ఓపెన్‌గానే ఉండాలి. లైసెన్స్ నెంబర్, సెంటర్ పేరు, ఫీజుల వివరాలు స్పష్టంగా చూపించాలి. ప్రవేశద్వారం వద్ద సీసీటీవీ, రిసెప్షన్, కామన్ ఏరియా వంటి సౌకర్యాలు ఉండాలని అధికారులు స్పా యజమానులకు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్, మహిళా శిశు భద్రతా విభాగం డీసీపీ సృజన, ఎస్ఓటీ డీసీపీ శోభన్ తదితర అధికారులు, స్పా యజమానులు హాజరయ్యారు.






