- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DGP Jithendar Reddy : గోరక్షకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు : డీజీపీ జితేందర్ రెడ్డి హెచ్చరికలు
బక్రీద్ పండగ(Bakrid Festival) నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి(DGP Jithendar Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బక్రీద్ పండగ(Bakrid Festival) నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి(DGP Jithendar Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 7న ముస్లిం సోదరులు జరుపుకోనున్న బక్రీద్ పండగ నేపథ్యంలో నేడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఏడీజీ కమిషనర్ మహేష్ ఎం. భగవత్, ఐజీపీ మల్టీజోన్-1 ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి పలు కీలక సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో గోరక్షకులు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు.
ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు అనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకు రావాలని కోరారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఎవరైనా ఆవుల అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా కలిసి మెలసి బక్రీద్ జరుపుకోవాలని జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.






