- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తం.. EESLకు రూ.200 కోట్ల బకాయిలు
పురపాలక శాఖ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో సీడీఎంఏ 2019 ఒప్పందం చేసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పురపాలకశాఖ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో సీడీఎంఏ 2019 ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రంలోని 73మున్సిపాలిటీల్లో ముగిసింది. మరో 67మున్సిపాలిటీల్లో 2027 వరకు గడువు ఉంది. అయితే కాంట్రాక్టు ఎజెన్సీకి పాత బకాయిలు చెల్లించకపోవడంతో వీధిదీపాల నిర్వహణను సదరు ఎజెన్సీ గాలికొదిలేసిందని పలు మున్సిపాలిటీల్లో మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చెబుతున్నారు. పైసలిస్తలేరని ఈఈఎస్ఎల్.. పనిచేయకపోవడంతోనే ఇవ్వడంలేదని మున్సిపల్ అధికారులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
9.78 లక్షల లైట్లు..
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలను కలిపితే ఈ సంఖ్య 160కి చేరింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ లను కలిపి 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కొత్తగా ఏర్పడిన 20 మున్సిపాలిటీలను మినహాయిస్తే 140 మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ కే అప్పగించిన విషయం తెలిసిందే. వీటిలో 9.78లక్షల స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. ఒక్క వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 1.5 లక్షలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
రూ.200 కోట్ల బకాయిలు..
రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్లకు సంబంధించి కాంట్రాక్టు ఏజెన్సీ అయిన ఈఈఎస్ఎల్ కు రూ.200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పురపాలకశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఓఆర్ఆర్ పరిధిలోని 7మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లోనే సుమారు 2.40లక్షల స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. అత్యధిక బకాయిలు సైతం వీటిల్లోనే ఉన్నాయని సమాచారం. ఈఈఎస్ఎల్ కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ నుంచి ఆదేశాలు జారీచేసినా పట్టించుకోవడంలేదనే విమర్శలూ లేకపోలేదు. రూ.30 కోట్లు బిల్స్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
కొత్త టెండర్ కోసం ప్రభుత్వానికి లేఖ..
పురపాలకశాఖ పరిధిలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ గడువు ముగియడంతో కొత్త టెండర్లకు వెళ్లాలా? మళ్లీ ఈఈఎస్ఎల్ సంస్థకే ఇవ్వాలా? అనే విషయంపై క్లారిటీ కోసం ప్రభుత్వానికి సీడీఎంఏ అధికారులు లేఖ రాశారు. 67 మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణ గడువు 2027 వరకు ఉన్నది. దీంతో మరో 73 మున్సిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పడిన 20 మున్సిపాలిటీలకు సంబంధించిన టెండర్లను ఈఈఎస్ఎల్ సంస్థకే అప్పగించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి క్లారిటీ రాగానే ప్రాసెస్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.






