ఆగిపోయిన ప్రోగ్రాం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు అబద్దాలు!

by GSrikanth |
ఆగిపోయిన ప్రోగ్రాం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు అబద్దాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్​ప్రొఫైల్​పథకం అటకెక్కినది. ప్రోగ్రాం లక్ష్యం పూర్తి కాకుండానే మధ్యలోనే ఆగిపోయింది. ఇక ప్రారంభమయ్యే ఛాన్స్​కూడా కనిపించడం లేదు. వైద్యారోగ్యశాఖ వద్ద కూడా సరైన సమాధానం లేదు. కానీ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు మాత్రం హెల్త్ ప్రోఫైల్​ స్కీమ్​పై గొప్పలు చెప్పడం విచిత్రంగా ఉన్నది. వాస్తవంగా ఈ పథకం వలన ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ప్రభుత్వం దీన్ని మొక్కుబడిగానే నిర్వహించినది. ములుగు, సిరిసిల్లా జిల్లాల్లో పైలెట్​ప్రాజెక్ట్​ను పూర్తి చేశారు. రెండు జిల్లాల్లో సగటున 80 శాతం మంది జనాలకు బీపీ, షుగర్​, తదితర రోగాలు ఉన్నట్లు గుర్తించారు. ములుగు జిల్లాల్లో 60 శాతం మంది ప్రజల్లో ఏదో ఒక రోగం తో బాధపడుతున్నట్లు గుర్తించారు. సిరిసిల్లాలోనూ 40 శాతం మందికి సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికీ మరో 45 శాతం మందికి రిపోర్టులు ఇవ్వాల్సి ఉన్నది. రిపోర్టులు కోసం ప్రతీ రోజు అక్కడి ప్రజలు వైద్యాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాలు లేనిది నివేదికలు ఇవ్వమని సదరు ఆఫీసర్లు తేల్చిచెబుతున్నారు.

కంగుతున్న సర్కార్

హెల్త్ ప్రొఫైల్ ఫైలెట్​ప్రాజెక్ట్​నిర్వహణ ద్వారా ములుగు, సిరిసిల్లా జిల్లాల్లోని ప్రజల్లో ఉన్న ఆరోగ్య సమస్యలను చూసి ప్రభుత్వం కంగు తిన్నది. పైకి జనాలు ఆరోగ్యంగానే కనిపించినప్పటికీ టెస్టుల ద్వారా తేలిన ఫలితాలు చూసి బాధితులతో పాటు ఆఫీసర్లూ షాక్​కు గురయ్యారు. వీరందరికీ చికిత్సను అందించడం పెద్ద సవాల్​గా మారుతుందని సర్కార్​భావించింది. పైగా రాష్ట్రమంతటా సరాసరి ఇదే విధానంలో రిపోర్టులు తేలే ప్రమాదం ఉన్నదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్ధిక మాంద్యంతో ఉన్న ప్రభుత్వం.. అందరికీ మందులు, ట్రీట్మెంట్​ఇచ్చేందుకు భారీ స్థాయిలో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా వేసింది. దీంతో కొత్త తల నొప్పలు ఎందుకు తెచ్చుకోవాలని ప్రభుత్వం డైలమాలో పడింది. పైలెట్​ప్రాజెక్ట్ నిర్వహించామని కొంత కాలం పాటు చెప్పుకుంటూ కాలం ఎల్లదీయాలని భావిస్తున్నది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యుల్​రాగానే ప్రజలు కూడా ఈ హెల్త్​ ప్రోఫైల్​ ముచ్చట మరిచిపోతారని భ్రమాలో ప్రభుత్వం ఉన్నది. ఈ కారణంతోనే హెల్త్​ప్రొఫైల్​పథకాన్ని అసంపూర్ణంగా ఆపేసినట్లు తెలిసింది. 2017లో పునాది పడ్డ పథకం , ఇప్పటికీ రాష్ట్రమంతటా పూర్తి కాకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కంటి వెలుగు పథకం లానే హెల్త్​ ప్రోఫైల్​కూడా పూర్తి స్థాయి లక్ష్యం చేరకుండానే నిలిచిపోయినది.

అధికారుల్లోనూ లేని పట్టింపు

హెల్త్​ప్రొఫైల్ స్కీమ్​అటకెక్కినా, అధికారుల్లో పట్టింపు లేదు. ప్రజలకు మేలు జరిగే ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతున్నారు. గతంలో ఉన్న ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్​ఈ స్కీమ్​ను స్పీడ్​గా నిర్వహించాలని కొంత వరకు ప్రయత్నించారు. దానిలో భాగంగానే పైలెట్​ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అది పూర్తయి 3 నెలలు గడిచినా ఇప్పటి వరకు పూర్తి స్థాయి ప్రాజెక్ట్​ను నిర్వహించలేదు. ఇప్పుడున్న ఫ్యామిలీ వెల్ఫేర్​ అధికారులు కూడా ఈ అంశాన్ని లైట్​ తీసుకున్నట్లు స్వయంగా ఆరోగ్యశాఖలోనే చర్చ జరగడం గమనార్హం.

ఫైలెట్ ప్రాజెక్ట్​రిజల్డ్స్ ఇలా...

= ములుగు జిల్లాలో 1,81,540 మందికి స్క్రీనింగ్​చేయగా 1,10,527 మంది రోగాల రిస్క్​లో ఉన్నట్లు తేలింది. వీటిలో 11,896 మందికి థైరాయిడ్​,28,281 మందికి లివర్ సమస్యలు, 28,857 మందికి కాల్షియం లోపం, సీబీపీ లో 23, 216 మందికి అబ్​ నార్మల్​, లిపిడ్​ ప్రోఫైల్​లో 65, 586 మందికి సమస్యలు ఉన్నట్లు గుర్తించగా, వీరిలో రక్తహీనతే ఎక్కువ మందికి ఉన్నది. ఇక 12,186 మంది కిడ్నీ సమస్యలు , అమైలేస్ ఎంజైమ్​ లోపంతో ​11, 752 మంది , యూరిక్​ యాసిడ్​ఎర్రర్​తో మరో 10, 124 మంది , అన్​కంట్రోల్​డయాబెటీస్​తో 9,775 మంది బాధపడుతున్నట్లు హెల్త్​ ప్రొఫైల్ ఫైలెట్ ప్రాజెక్ట్ సర్వేలో వెల్లడైంది.

= సిరిసిల్లా జిల్లాలో 3,38,761 మందికి స్క్రీనింగ్​ చేయగా , 1,33,230 మంది హెల్త్​రిస్క్​లో ఉన్నట్లు తేలింది. వీరిలో 27,985 మందికి కొలెస్ట్రాల్​శాతం అబ్​నార్మల్​గా ఉన్నట్లు లిపిడ్​ ప్రోఫైల్​టెస్టు ద్వారా బహిర్గతమైంది. ఇక 27,857 మందికి కాల్షియం లోపం, 17,331 మంది సీబీపీ (కంప్లీట్​ బ్లడ్​ పిక్చర్​)లో అబ్​నార్మల్ గా ఉన్నది. వీటిలో 26.2 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. 17,001 మందికి థైరాయిడ్​, 15,839 మందికి లివర్​పంక్షన్​లో తేడా ఉన్నట్లు ఎల్​ఎఫ్​టీ(లివర్​ పంక్షన్​ టెస్టు)లో వెల్లడైంది. మరోవైపు 14,267 మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్లు ఆర్​ఎఫ్​టీ (కిడ్నీ పంక్షన్​ టెస్టు)లో తేలింది.10,797 మందికి అమైలేస్​ఎంజైమ్​లోపం , 9180 మందికి అదుపులో లేని డయాబెటీస్​ఉన్నట్లు (హెచ్ బీ ఏ1 సీ) నిర్ధారణ అయింది. 5,481 మందికి యూరిక్​ఆసిడ్​అబ్​నార్మల్​ఉన్నది.

Advertisement

Next Story