‘యాదాద్రి’ జెన్ కో బాధితులకు న్యాయం చేసే దిశగా సీఎం అడుగులు

by Pooja |

నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పర్యటించనున్నారు. ఏడాది ప్రజా పాలన విజయెత్సవాలలో భాగంగా యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్( YPPU) ను ప్రారంభించనున్నారు

‘యాదాద్రి’ జెన్ కో బాధితులకు న్యాయం చేసే దిశగా సీఎం అడుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పర్యటించనున్నారు. ఏడాది ప్రజా పాలన విజయెత్సవాలలో భాగంగా యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్( YPPU) ను ప్రారంభించనున్నారు. అనంతరం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్ట్(Brahmin Vellam Etthipothala Project), నల్లగొండలోని మెడికల్ కాలేజీ(Nalgonda Medical College)ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం సాయత్రం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణ సాధికారికకు విద్యుత్ వెలుగులు తొడ్పాడుతాయని, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్(Yadadri Thermal Power Project) త్వరలో తెలంగాణ జాతికి అంకితం చేయనున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్లాంట్ గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారని, దీనితో 5 యూనిట్ల విద్యుత్ సామర్ధ్యం 4000 మెగావాట్ల సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేలా యాదాద్రి థర్మల్ ప్లాంట్ సోలార్‌ను రూపొందిచామని ఆయన పేర్కొన్నారు. వచ్చే మే నెలకల్లా 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన పెరుగుతుందని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ జెన్ కో నిర్వహణలో BHEL నిర్మాణంలో నిర్వాసితులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రెండు వేలమంది సిబ్బంది కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తామని భట్టి ప్రకటించారు.

Next Story