Drugs Case: చర్లపల్లి డ్రగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్

by Ramesh Naini |   (  Updated:2025-09-08 17:40:12  IST  )

హైదరాబాద్ శివారు చర్లపల్లిలో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు వచ్చిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించనుంది.

Drugs Case: చర్లపల్లి డ్రగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారు చర్లపల్లిలో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు వచ్చిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించనుంది. ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖకు, ఎక్సైజ్ అధికారులకు నివేదికలు ఇవ్వాలని తెలిపింది. వాగ్దేవీ ల్యాబొరేటరీస్ పై ఆకస్మికంగా మహారాష్ట్ర పోలీసులు జరిపిన దాడులలో దొరికిన మెటీరియల్ పై నివేదికలు అందజేయాలన్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంచనా వేయాలని ఆదేశాలిచ్చారు. మోఫెడ్రోన్ డ్రగ్ కేసులు ఇది వరకు ఎమైనా నమోదైనా అన్న అంశంలో వివరాలు సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముంబై పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, నిందితులుగా పేర్కోన్న వారి వివరాలు సమగ్రంగా క్రైమ్ డేటా తెలుసుకునేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ముంబై పోలీసులకు పట్టుబడ్డ బంగ్లాదేశ్ మహిళకు హైదరాబాద్ లో వాగ్దేవీ ల్యాబొరేటరీస్ కి గల సంబంధాల వివరాలను సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది.

చర్లపల్లి ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫాక్టరీల పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్‌వోసీలో రిజిష్టర్‌ చేసుకోని కంపెనీలలు ఎన్ని ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తున్నది. చర్లపల్లి, జీడిమెట్ల, పాశమైలారంలో అనుమతులు లేని కంపెనీలపై తనిఖీలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. వాగ్దేవీ ల్యాబొరేటరీస్ డ్రగ్స్ పట్టివేతపై సంస్థ నిర్వాహకుడు విజయ్ వోలేటి కీలక స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతేడాది వాగ్దేవీ ల్యాబొరేటరీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడులు జరిపారని వెల్లడించినట్లు తెలుస్తుంది. డ్రగ్స్ తయారు చేయడం లేదని నివేదికలు సమర్పించినట్లు తెలిపినట్లు చెబుతున్నారు. గుజరాత్, డిల్లీకి చెందిని కెమికల్‌ కంపెనీలు రిసెర్చ్ చెస్తామని తెలిపినట్లు తెలుస్తుంది. అమెరికా, సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించినట్లు తెలుస్తుంది. ముంబై పోలీసులు తెలుపుతున్న సమాచారం మేరకు విజయ్ పై ముంబైలో డ్రగ్స్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిపై పూర్తి వివరాలు రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించాల్సి ఉంది.

Next Story