- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రోరైలు మార్గాల్లో అభివృద్ధి.. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050
హైదరాబాద్ మహానగరంలో మెట్రోపాలిటన్ ఏరియాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందుకనుగుణంగా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపొందిస్తున్నది. ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాన్సిట్ - ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ (టీఓడీ) విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 9 మార్గాలను గుర్తించారు. ఆ ఏరియాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కోసం లోకల్ ఏరియా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
టీఓడీలు ఇలా..
ట్రాన్సిట్-ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ (టీఓడీ) అనేది ప్రజా రవాణా కేంద్రాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ప్రాజెక్టు. ఆఫీసులు, ఇంటికి నడుచుకుంటూ వెళ్లే విధంగా మిశ్రమ వినియోగ కమ్యూనిటీలను సృష్టించడంపై దృష్టి సారించిన ప్రణాళికా విధానం. ప్రైవేటు వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, శక్తిమంతమైన, నివాసయోగ్యమైన, స్థిరమైన పట్టణ వాతావరణాలను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. టీఓడీలో భూ వినియోగం, రవాణా ప్రణాళికను ఏకీకృతం చేస్తుంది. తరచుగా రవాణా స్టేషన్ల చుట్టూ అధిక సాంద్రతలు, మిశ్రమ వినియోగ అభివృద్ధి, పాదచారులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రాధాన్యతగా ఉంటుంది.
9 మార్గాల్లో..
హెచ్ఎండీఏ పరిధిలో 9 టీఓడీ మార్గా లను ప్రభుత్వం గుర్తించింది. మెట్రో రైలు మార్గాలతోపాటు హెచ్ఎండీఏ చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కారిడార్ సైతం ఉన్నది. ముఖ్యంగా మెట్రోరైలు మార్గాల్లో ఒక స్టేషన్ మరో స్టేషన్ మధ్య ఏరియాను అభి వృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన స్థానికంగా ఉండే అన్ని పరిస్థితులకనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని హెచ్ఎండీఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా ఎస్ఆర్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో లోకల్ ఏరియా ప్ర ణాళికలను సిద్ధం చేసేందుకు హెచ్ఎండీ ఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతోపాటు రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు మార్గంలో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించనున్నారు.






