- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gandhi Bhavan: గాంధీభవన్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Telangana State formation) తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా (Gandhi Bhavan) గాంధీ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన.. ఆరు దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించిందని ఆయన అన్నారు. ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ.. పునర్నిర్మాణ దిశగా (Congress) కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ బాటలో తెలంగాణ నడుస్తోందని, రెండు కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతోందని తెలిపారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్ సంకల్పం అని చెప్పారు. తెలంగాణలో శాస్త్రీయ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో దేశానికే మార్గదర్శకమని కొనియాడారు. దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలన్న అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాదిలోనే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ యువ వికాస్ ద్వారా 5 లక్షల యువతకు ఆర్థిక సాయం, మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, రూ.500 వరి బోనస్, సన్న బియ్యం వంటి పథకాలు తీసుకొచ్చినట్లు గుర్తుకు చేశారు. ఇక 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అమీర్ అలీఖాన్, బలమురి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు నూతి శ్రీకాంత్, మెట్టు సాయి కుమార్, అజ్మత్, కొత్వాల్, తహర్ బీన్ అహ్మదాని తదితరులు పాల్గొన్నారు.






