సృష్టి కేసులో మరిన్ని సంచలనాలు..పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు

by Ajay Maddhiboyina |

సృష్టి షెర్టిలిటీ సెంట‌ర్‌లో జరిగిన దారుణాలకు సంబంధించిన కేసులో డాక్టర్ నమ్రతను నేడు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు కోర్టులో

సృష్టి కేసులో మరిన్ని సంచలనాలు..పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: సృష్టి షెర్టిలిటీ సెంట‌ర్‌లో జరిగిన దారుణాలకు సంబంధించిన కేసులో డాక్టర్ నమ్రతను నేడు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా కస్టడీలో సంచలన విషయాలను పోలీసులు రాబట్టారు. పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రత లింకులు పెట్టుకున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి అక్రమాలు జరిపినట్టు నిర్దారించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించిన నమ్రత పేదింటి ఆడబిడ్డలను టార్గెట్ చేసుకున్నట్టు తేలింది. ఫెర్టిలిటీ సేవలు అందిస్తామని మాయ మాటలు చెప్పి, డెలివరీ తరవాత నవజాత శిశువులను కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. ఇక ఈ కేసులో నమ్రతపై 6ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

Next Story