- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridhar Babu: దావోస్ వేదికగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0 ఆవిష్కరిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
దావోస్‍లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పారిశ్రామికాభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్‌లో ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్నదే మా సంకల్పం అని రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. దావోస్ వేదికగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0 ఆవిష్కరిస్తామన్నారు. దావోస్ పర్యటనపై ఎక్స్ లో పోస్టు చేసిన శ్రీధర్ బాబు.. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అధికారులు ఈ వ్యూహాత్మక చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు.






