- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వేం అధికారివయ్యా.. మరీ ఇంత ఘోరమా..?
హైదరాబాద్ నగరంలో ఏసీబీ దాడులు జరిగాయి. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలో ఏసీబీ దాడులు జరిగాయి. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో స్పెషల్ ఆర్ఐ భూపాల మహేశ్ ఏసీబీకి చిక్కారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు మహేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో నిన్న ఈ రోజు తనిఖీలు కొనసాగాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు జాయింట్ఆపరేషన్చేసి హాళ్లలో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీశారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్‌కు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ప్రకటించినప్పటి నుంచి అధికార యంత్రాంగం అలర్ట్అయింది. ఈ క్రమంలోనే ఏపీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారులు ఏం గుర్తించారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు గాను 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ వివరాలను కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ పంటల ఎమ్మెస్పీ కోసం రూ. 2.7 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుల వడ్డీ రాయితీ కింద రూ. 15,642 కోట్లు కేటాయించామని, పెట్టుబడిపై 50 శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో పంటకు ఎంత ఎమ్మెస్పీ కేటాయించారో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.






