గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

by Muthe.Rajitha |

గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు.

గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. శాసనసభ జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన, గల్ఫ్‌లో కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే మన ఊరు–మన బడి పథకానికి నిధులు రావడం లేదని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీహెచ్‌ఎంసీ పునర్విభజనలో కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం మళ్లీ పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story