మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లేలా కార్యచరణ రూపొందించాలని అధికారులకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) చైర్మన్ చల్లా నరసింహారెడ్డి ఆదేశించారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
X
  • టీయూఎఫ్ఐడీసీ బోర్డు మీటింగ్‌లో చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లేలా కార్యచరణ రూపొందించాలని అధికారులకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) చైర్మన్ చల్లా నరసింహారెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన 43వ బోర్డు మీటింగ్ నిర్వహించారు. సంవత్సరం కాలం పాటు జరిగిన అభివృద్ధి, మున్సిపాలిటీలలో అమృత్ 2.0, జీఓ నెం. 51 నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. రానున్న రోజులలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నిధులను వాడుకుని అభివృద్ధి సాధించేందుకు కృషి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ టీకే.శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఈఎన్సీ భాస్కర్ రెడ్డి, కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఫాల్గున్ కుమార్, ఫైనాన్స్ మేనేజర్ సుబ్బారావు గారు, కంపెనీ సెక్రటరీ టి.సుబ్బారావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు హాజరయ్యారు.

Next Story