- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు కోర్డును గడువు కోరిన స్పీకర్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీం కోర్టును కోరారు.

దిశ, వెబ్ డెస్క్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. వివిధ కారణాలతో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification of MLAs) వేసేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జూలై 31న.. మూడు నెలల్లోపు 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది.
ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని.. ఆలస్యం జరిగే కొద్ది ఫిరాయింపు దారులు ప్రయోజనం పొందుతారని.. ఇలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొంతమందిని అసెంబ్లీలో విచారించారు. అయితే నేటితో కోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) కార్యదర్శి సుప్రీం కోర్టును కోరారు.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా 8 మంది మాత్రమే స్పందించారని, వారిలో నలుగురి విచారణ మాత్రమే జరిగిందని మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉందని, ఈ విచారణను పూర్తి చేసేందుకు తమకు సమయం కావాలని స్పీకర్ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. మరి అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థనపై సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంతే వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలోనే తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ముఖ్యంగా బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల భవితవ్యంపై అందరి దృష్టి నిలిచింది.






