- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఎమ్మెల్యే పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్
మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ (BRS) గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి (Congress) ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఇవాళ తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy), కాలే యాదయ్య (Kale Yadaiah) బీఆర్ఎస్‍లోనే ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వీరిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. కాగా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గతంలోనే తీర్పును వెలువరించారు. ఇప్పుడు తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలేయాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా ఏడుగురికి క్లిన్ చిట్ ఇచ్చారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ విషయంలో ఇంకా విచారణ జరగాల్సి ఉంది.
రేపు సుప్రీంలో విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై (Defection Case) రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. రేపు విచారణ దృష్ట్యా ఇవాళ స్పీకర్ తీర్పును వెలువరించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో? రేపు సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.






