- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టికెట్ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు ఆదాయం
టికెట్ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే రికార్డుస్థాయి ఆదాయాన్ని రాబట్టింది. బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని గడువుకు 14 రోజుల ముందే సాధించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కట్టడి కఠినతరం కావడంతో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆదాయం వచ్చిపడింది. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి టికెట్ తనిఖీల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 223.60 కోట్లను వసూలు చేస్తూ జోన్ కొత్త మైలురాయిని సృష్టించింది. దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని నమోదు చేసింది. రైల్వే బోర్డు నిర్దేశించిన రూ. 221.08 కోట్ల లక్ష్యాన్ని ఆర్థిక సంవత్సరం ముగియడానికి 14 రోజుల ముందే అధిగమించడం విశేషం. ఇంతకుముందు 2023-24లో నమోదైన రూ. 220.81 కోట్ల ఆదాయాన్ని ఈ ఏడాది అధిగమించింది.
టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజీ వంటి కేసులపై జరిపిన తనిఖీల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. అలాగే 2025 అక్టోబర్ 18న ఒక్క రోజులోనే రూ. 1.85 కోట్ల ఆదాయం నమోదు కావడం మరో ప్రత్యేకత. టికెట్ తనిఖీ చర్యలతో టికెట్ లేకుండా చేసే ప్రయాణాలను తగ్గించడంలో కీలకంగా పనిచేశాయని అధికారులు తెలిపారు. డిజిటల్ టికెటింగ్ సౌకర్యాలు, ఏటీవీఎంలు, క్యూఆర్ కోడ్ వ్యవస్థలతో కలిసి టికెట్ అమ్మకాలు పెరగడంలో కూడా ఇవి దోహదం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వాణిజ్య విభాగం సిబ్బందిని అభినందించారు. టికెట్ తనిఖీ వ్యవస్థ ప్రయాణికుల్లో నమ్మకాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.






