- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sonia Gandi: మంత్రి కొండా సురేఖకు సోనియాగాంధీ ప్రశంసలు
కొండా సురేఖకు సోనియాగాంధీ లేఖ రాశారు.

తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో 42 ఏళ్ల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకుని మహా కుంభాభిషేకం నిర్వహించడంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను (Konda Surekha) కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) ప్రశంసించారు. కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించడం హర్షణాయమన్నారు. ఈ మేరకు కొండా సురేఖకు సోనియా లేఖ రాశారు. త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందని, తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు సురేఖను లేఖ ద్వారా సోనియా అభినందించారు. కాగా, 1982లో మొదటిసారి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరిగిన సమయంలో ఇక్కడ మహా కుంభాభిషేకం (Kaleswaram Kumbhabhishekam) నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 42 ఏళ్ల తర్వాత గత నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలను రాష్ట్రకాళేశ్వర మహా కుంభాభిషేకం భేష్






