- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతుండ్రు.. ఎంపీ ఈటల సెన్సేషనల్ కామెంట్స్
కమలం పార్టీలో అగ్ర నేత మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. హుజూరాబాద్ (Huzurabad) పరిధిలో ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) వెన్నంటే ఉండి 20 ఏళ్లుగా నడుస్తున్న తమకు పార్టీ ఎలాంటి పదవుల దక్కడం లేదని.. తమను చెల్లని రూపాయిగా చూస్తున్నారని ఆయన అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కమలం పార్టీలో అగ్ర నేత మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. హుజూరాబాద్ (Huzurabad) పరిధిలో ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) వెన్నంటే ఉండి 20 ఏళ్లుగా నడుస్తున్న తమకు పార్టీ ఎలాంటి పదవుల దక్కడం లేదని.. తమను చెల్లని రూపాయిగా చూస్తున్నారని ఆయన అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హుజూరాబాద్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ గోడు చెప్పుకునేందుకు శామీర్‌పేట (Shameerpet)లోని ఈటల రాజేందర్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు హుజూరాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇవాళ ఉదయమే పెద్ద సంఖ్యలో శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ పదవులలో తమకు అవకాశం ఇవ్వడం లేదని, బండి సంజయ్ వర్గం తమను పట్టించుకోవడం లేదని వారు ఈటలకు ఫిర్యాదు చేశారు. సమావేశం అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా హుజూరాబాద్ కార్యకర్తలు తన వెంటనే నడుస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారని కామెంట్ చేశారు. కావాలనే కొందరు తనపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వీధి పోరాటాలు తమకు అవసరం లేదని అన్నారు. తమపై జరుగుతోన్న కుట్రలను తిప్పికొడదామని నాయకులు, కార్యకర్తలకు ఈటల పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాకు నరకం చూపించాడు..
తాన బాజప్తా యుద్ధం చేస్తానే తప్ప.. బేజాప్తా యుద్ధం ఎనాడూ చేయబోనని ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ త్యాగాలకు మారు పేరని.. తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ బిడ్డలు వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. తాను పదవుల కోసం ఏనాడు పార్టీలు మారలేదని అన్నారు. 2021 ఉప ఎన్నికల్లో కొందరునాయకులు అమ్ముడుపోయినా.. హుజూరాబాద్ ప్రజలకు తనను గెలిపించారని తెలిపారు. సమైక్య పాలనలోనూ నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నానని అన్నారు. పార్టీ వీడిని తరువాత కూడా కేసీఆర్ (KCR) తనకు నరకం అంటే ఏంటోచూపించారని కామెంట్ చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్న వారిని హెచ్చరించారు. కేసీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడిన చరిత్ర తనదని అన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కడుపులో కత్తులు పెట్టుకుని తనపై కుట్రలు చేస్తున్నారని.. శామీర్‌పేట్ అడ్డా బీజేపీ అడ్డా అని ఈటల నినదించారు.
నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిది కురచ మనస్తత్వం..
ఖచ్చితంగా తనపై జరగుతోన్న కుట్రలను పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లో ప్రతి వార్డ్ మెంబర్, సర్పంచ్ తమ వాళ్లే ఉంటారని తెలిపారు. స్థానిక ఎన్నికలను హుజూరాబాద్ ఎన్నికలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని అన్నారు. ఆ సెగ్మెంట్‌లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లే వచ్చాయని.. తాను రాక ముందు హుజూరాబాద్‌లో అసలు బీజేపీకి కేడర్ లేదన్నారు. అదేవిధంగా కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్‌లో బీజేపీకి 50 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని అన్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిది కురచ మనస్తత్వమని కామెంట్ చేశారు. సర్పంచ్‌లకు పార్టీ బీఫామ్ అవసరం లేదని.. మావాళ్లనే పోటీలో పెడతామని ఈటల రాజేందర్ అన్నారు.






