బీఆర్ఎస్ లోకి తిరిగి వచ్చేందుకు కొందరు నేతలు సిద్ధం.! కేటీఆర్

by Geesa Chandu |   (  Updated:2024-08-15 17:16:47  IST  )

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక పరిణామం చోటుచేసుకుంది.

బీఆర్ఎస్ లోకి తిరిగి వచ్చేందుకు కొందరు నేతలు సిద్ధం.! కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ జెడ్పీటీసీ మార్పాక రవి మరియు మాజీ ఎంపీపీ ఒకరు కాంగ్రెస్ నుంచి బీఆరెస్ లోకి చేరారు. వారిని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అయితే ఇటీవలే మాజీ జెడ్పీటీసీ మార్పాక రవి, కడియం శ్రీహరి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు తిరిగి గులాబీ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలో పార్టీ శ్రేణులకు మరియు కార్యకర్తలకు మధ్య కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని తాటికొండ రాజయ్య కేటీఆర్ తో చెప్పారు. అయితే వాటన్నింటిని సరిదిద్దాల్సిన బాధ్యత తనపైనే ఉందని కేటీఆర్ చెప్పారని ఈ సందర్భంలో వివరించారు.తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలందరూ.. మళ్ళీ తిరిగి బీఆరెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Next Story