- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఘరానా మోసం!
గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ట్రైనింగ్ ఇచ్చి

దిశ, వెబ్ డెస్క్: గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ట్రైనింగ్ ఇచ్చి ఆ తరవాత ఉద్యోగం ఇస్తామంటూ నిరుద్యోగులకు ఫ్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ గాలం వేసింది. బాధితుల నుండి విడతల వారిగా డబ్బులు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసినట్టు సమాచారం. ఒక్కొక్కరి నుండి దాదాపు రూ.2 లక్షల వరకు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు రోడ్డెక్కారు. రెండు మూడు నెలలు జీతాలు ఇచ్చినట్టు నటించి ఆ తరవాత బోర్డు తిప్పేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాప్ టాప్ లు కూడా ఇచ్చారని వర్క్ ఫ్రం హోం ఇచ్చారని అన్నారు. సాలరీ పడకపోవడంతో మెయిల్స్ పెడితే రిప్లై రాలేదన్నారు. ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆఫీసుకు వెళ్లినట్టు తెలిపారు. వెళ్లి చూసేసరికి కంపెనీ పూర్తిగా క్లోజ్ చేసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు.






