Snakes in Ministers Quarters: హైదరాబాద్‌ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పాముల కలకలం

by Ramesh Naini |

హైదరాబాద్‌ నగరం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మరోసారి పాముల కలకలం చెలరేగింది.

Snakes in Ministers Quarters: హైదరాబాద్‌ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పాముల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ నగరం బంజారాహిల్స్‌లోని (Ministers Quarters) మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మరోసారి పాముల కలకలం చెలరేగింది. తాజా ఘటనలో రెండు పాములు క్వార్టర్స్‌ పరిసరాల్లో కనిపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న భద్రత సిబ్బంది, స్నేక్‌ క్యాచర్స్‌ వెంటనే అక్కడకు చేరుకుని పాములను సురక్షితంగా పట్టుకున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పాములు కనిపించిన ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో మంత్రుల క్వార్టర్స్‌లో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Next Story