- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'షూ'లో గోల్డ్ స్మగ్లింగ్.. శంషాబాద్ లో వ్యక్తి అరెస్ట్.!
by Geesa Chandu |
దుబాయ్ నుంచి హైదరాబాద్ కు బంగారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ నుంచి హైదరాబాద్ కు బంగారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి EK - 528 విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ఒక వ్యక్తిని, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్(DRI) అధికారులు తనిఖీ చేయగా.. ప్రయాణికుడు ధరించిన బూట్లు, వీపుకు తగిలించుకున్న లగేజీలో దాదాపుగా 1.50 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ సుమారుగా రూ. 1.06 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






