- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పైస్ జెట్ విమానంలో పొగలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
వరుస హెలికాప్టర్, విమాన ప్రమాదాలు దేశ ప్రజలను కలవర పెడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: వరుస హెలికాప్టర్, విమాన ప్రమాదాలు దేశ ప్రజలను కలవర పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ కాసేపటి క్రితం శంషాబాద్ (Shamshabad) రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad) నుంచి తిరుపతి (Tirupati) వెళ్లాల్సిన స్పైస్ జెట్ (Spice Jet) ఫ్లైట్ నెంబర్ SG-2138లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ భాగం నుంచి పొగలు, కిరోసిన్, కాలిన వాసనను ఫ్లైట్ సిబ్బంది గుర్తించారు. అనంతరం విమానం టేకాఫ్ చేయడానికి భయంగా ఉందని.. పైలట్ ప్రయాణికులతో చెప్పాడు. దీంతో విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు భయంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. గత 3 గంటలుగా ఎయిర్‌పోర్టులో 60 మంది ప్రయాణికులు తిరుపతి వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్నారు. అయితే, షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30కి స్పైస్ జెట్ ఫ్లైట్ శంషాబాద్ నుంచి ఫ్లైట్ టేకాఫ్ కావాల్సి ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.






