యువత తగిన ఉద్యోగం చేయాలనే స్కిల్ యునివర్సిటీ ఏర్పాటు : మంత్రి శ్రీధర్ బాబు

by Bhanu |

యువత తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

యువత తగిన ఉద్యోగం చేయాలనే స్కిల్ యునివర్సిటీ ఏర్పాటు : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, కార్వాన్ : యువత తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని ఉస్మానియా పీజీ లా కాలేజీ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ , స్కిల్, లోన్ మేళా" ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిగా కేంద్ర మంత్రి జయంతి చౌదరి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రాజ్య సభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, హీరావతి అనిల్ కుమార్, గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి జయంత్ చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ , స్కిల్, లోన్ మేళా" ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను "స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్"గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర సహకారం కావాలని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరిని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అంతే కాకుండా యువత శిక్షణకు కొత్త కోర్సులు రూపొందిస్తున్నామని తెలిపారు. యువత వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి జయంతి చౌదరి హామీని ఇచ్చారు. యువత లో నైపుణ్యం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Next Story