- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదంలో సింగూరు ప్రాజెక్టు.. నిపుణుల అధ్యయన కమిటీ పరిశీలన
మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు (Singur Project) ఇటీవల భారీ వర్షాలకు క్లస్టర్ గేట్లతో పాటు రిజర్వాయర్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ డ్యామేజ్‌లు అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు (Singur Project) ఇటీవల భారీ వర్షాలకు క్లస్టర్ గేట్లతో పాటు రిజర్వాయర్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ డ్యామేజ్‌లు అయ్యాయి. అయితే, సింగూరు ప్రాజెక్టు పునరుద్ధరణ, భవిష్యత్తు ప్రభావాలను అంచనా వేయడానికి తెలంగాణ సర్కార్ తాజాగా ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల అధ్యయన కమిటీ (Technical Expert Committee)ని ఏర్పాటు చేసింది. అయితే, ఇవాళ ఆ కమిటీ సింగూరు ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పరిశీలను వెళ్లింది. డిసెంబర్ నుంచి సింగూరు రిజర్వాయర్‌ను పూర్తిగా ఖాళీ చేసి, డ్యామేజ్ అయిన భూమి బండ్లు, గేట్లు, ఇతర భాగాల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కమిటీ సూచించింది. ఈ పనులు పూర్తయ్యే వరకు హైదరాబాద్‌కు తాగునీరు, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 66 వేల ఎకరాల సాగునీటికి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. మరోవైపు అందుకు ప్రత్యామ్నాయంగా కాఫర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలని జల మండలి అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీ పరిశీలన చేపడుతుంది.






