అప్పటి నుంచే KCRపై నా పోరాటం స్టార్ట్.. : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Disha Web Desk 4 |
అప్పటి నుంచే KCRపై నా పోరాటం స్టార్ట్.. : కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారని.. అహంకారంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని అప్పటి నుంచే కేసీఆర్‌పై తన పోరాటం ప్రారంభమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా తన పాత్ర పోషించానన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే పార్టీ బీజేపీ మాత్రమే అని ఆనాడు భావించానన్నారు.

దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు చూసి బీజేపీపై అప్పుడు నమ్మకం కలిగిందన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత బీజేపీ నిర్ణయాలతో పార్టీ బలహీనమైందన్నారు. కర్నాటక ఫలితాల తర్వత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ సమాజం కోసమే తన నిర్ణయం ఉంటుందన్నారు. తాను బీజేపీలోకి వెళితే కాంట్రాక్టు కోసమే వెళ్లానని ప్రచారం చేశానన్నారు. కాంట్రాక్ట్ కోసమే బీజేపీలోకి వెళితే మళ్లీ ఎందుకు పార్టీ మారతానన్నారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారన్నారు.

కానీ కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. 100 మంది బీఆర్ఎస్ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్‌తోనే ఉందన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు. మునుగోడు నుంచే తాను పోటీ చేయనున్నట్లు రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రెండు సీట్లు తాను కాంగ్రెస్‌ను అడగలేదన్నారు. కాంగ్రెస్ ఆదేశిస్తే గజ్వేల్ నుంచి పోటీలో ఉంటానన్నారు. డబ్బు, అధికారంతో మునుగోడులో గెలిచారన్నారు. గజ్వేల్‌లో అవకాశం ఇస్తే కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.



Next Story

Most Viewed