- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజేఐకి కనీస మర్యాద ఇవ్వరా? : మహా సర్కారుపై మండిపడ్డ చాడ వెంకట్ రెడ్డి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం హిమాయత్నగర్మగ్ధూం భవన్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర కు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కనీస మర్యాదలు చేయకపోవడం ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమే అవుతుందన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చాడ అన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఈ విషయంలో మానసిక వేదనకు గురయ్యారని , రాజ్యాంగంలో ప్రధానమైన న్యాయవ్యవస్థ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని అన్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగంలో ప్రధాన అంగాలుగా పిలవబడుతాయని చాడ గుర్తు చేస్తూ ఈ మూడింటినీ పరస్పరం గౌరవించుకోవాలన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఈ విషయంలో తగిన సూచనలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్‌చేశారు. కాగా, హైదరాబాదు చార్మినార్ సమీపాన గల గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం తనను తీవ్రంగా కలసి వేసిందని చాడా వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బాధాకరమైందని , చనిపోయిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని ప్రభుత్వాన్ని చాడ డిమాండ్‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.






